తాటి క‌ల్లు మేళా ర‌ద్దు.. మంత్రి పొన్నం కీల‌క ప్ర‌క‌ట‌న‌

క‌లం, వెబ్‌డెస్క్‌: గౌడ సంఘాల మ‌నోభావాల‌ను గౌర‌విస్తూ తాటి క‌ల్లు మేళా (Thatikallu Mela) కార్య‌క్ర‌మాన్ని ర‌ద్దు చేస్తున్న‌ట్లు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Ponnam Prabhakar) ఎక్స్ వేదిక‌గా ప్ర‌క‌టించారు. క‌ల్లు అమ్మ‌డం అనేది గీత కార్మికుల సంప్ర‌దాయ హ‌క్కు అని, వారి ఆత్మ గౌర‌వాన్ని కాపాడ‌టం ప్ర‌భుత్వ బాధ్య‌త అని మంత్రి పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా తాటి క‌ల్లు వినియోగాన్ని విస్త‌రించి స్టార్ హోట‌ల్స్‌, క‌ల్లు బార్ల రూపంలో ప్రోత్స‌హించాల‌నే ఉద్దేశంతోనే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌, మాజీ ఎంపీ బూర న‌ర్స‌య్య గౌడ్‌ల‌తో క‌లిసి ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టాల‌ని భావించామ‌ని చెప్పారు. అయితే గౌడ సంఘాల విజ్ఞప్తి మేరకు దీనిని రద్దు చేసుకుంటున్నామని, ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదని మంత్రి వివరించారు.

క‌ల్లు అనేతి కేవ‌లం మ‌త్తు ప‌దార్థం కాద‌ని, అది గీత కార్మికుల జీవ‌నాధార‌మ‌ని మంత్రి పొన్నం (Ponnam Prabhakar) అన్నారు. గీత‌ వృత్తి ఆధునిక పద్ధతుల్లో అభివృద్ధి చెందాలని, గౌడ కుటుంబాలు ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నదే ప్రభుత్వ సంకల్పమని ఆయన స్పష్టం చేశారు. కుల వృత్తుల హక్కులను హరించే ప్రయత్నం ఎవరు చేసినా ప్రభుత్వం ఊరుకోదని, గీత‌ కార్మికులకు ఎల్లప్పుడూ పూర్తి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా తాటి, ఈత చెట్ల పెంపకానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిందని, ప్రతి జిల్లాలో గౌడ సంఘాలు పెద్ద ఎత్తున ఈ చెట్లను పెంచేందుకు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు.

Read Also: రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>