త్రాగునీటి కొర‌త రాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి: పొంగులేటి

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో గ్రామీణ ప‌ట్ట‌ణ‌ప్రాంతాల్లో ఈ 45 రోజుల్లో ఎక్క‌డా త్రాగునీటి కొర‌త రాకుండా తగిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti) ఆదేశించారు. ఐఎండి హెచ్చ‌రిక‌ల నేపథ్యంలో తీసుకోవ‌ల‌సిన చ‌ర్య‌ల‌పై స‌చివాల‌యంలో 20 సంబంధిత శాఖ‌ల‌తో మంత్రి స‌మీక్ష నిర్వ‌హించారు. పెరుగుతున్న ఎండ‌లు, వ‌డ‌గాలుల నుంచి ప్ర‌జ‌ల‌ను ర‌క్షించ‌వ‌ల‌సిన బాధ్య‌త తమ ప్ర‌భుత్వంపై ఉంద‌ని చెప్పారు. ఈ మేర‌కు సంబంధిత శాఖ‌లు ప‌క‌డ్బందీగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌కు సూచించారు. ఈ ఏడాది-2026లో ఎండ‌లు, వ‌డ‌గాలులు అధికంగా వీచే ఛాన్స్ ఉంద‌ని చెప్పారు. జూన్ 15 వ‌ర‌కు కూడా అధిక ఉష్ణోగ్ర‌త‌లు ఉంటాయ‌ని తెలిపారు. రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖ‌, ఇండియ‌న్ మెట్రాలాజిక‌ల్ శాఖ సంయుక్తంగా రూపొందించిన “హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ -2026″ను మంత్రి విడుదల చేశారు.

24 గంట‌ల్లో మ‌ర‌మ్మ‌తులు చేపట్టాలి..

అనంతరం మంత్రి మాట్లాడుతూ.. నీటి కొరత (Drinking Water Shortage) దృష్ట్యా గ్రామీణ, పట్టణాల్లో మోటార్లు కాలిపోతే 24 గంట‌ల్లో మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టి నీటి స‌ర‌ఫరాకు ఆటంకం లేకుండా చూసుకోవాల‌న్నారు. హైద‌రాబాద్ లో డిమాండ్‌కు తగ్గట్టుగా ట్యాంక‌ర్ల ద్వారా నీటి స‌ర‌ఫ‌రా చేస్తున్నామ‌ని చెప్పారు. రోజుకు 14 గంట‌లు ఫిల్లింగ్ చేసి 15వేల ట్యాంక‌ర్ల ద్వారా నీటిని స‌ర‌ఫ‌రా చేస్తున్నామ‌ని వివరించారు. దీనిపై అన్నిశాఖ‌లు ముఖ్యంగా పంచాయితీ రాజ్‌, మున్సిప‌ల్, ఫైర్, హెల్త్ స‌మ‌న్వ‌యం చేసుకొని ప‌నిచేయాల‌న్నారు. ప్ర‌కృతి విప‌త్తుల వ‌ల్ల న‌ష్ట‌పోయిన బాధితుల‌ను ఆదుకోవ‌డానికి వీలుగా 15 రోజుల్లోగా ప్ర‌భుత్వానికి నివేదిక‌ల‌ను పంపించాల‌ని అధికారుల‌ను మంత్రి (Minister Ponguleti) ఆదేశించారు. వ‌డ‌గాలుల ప్ర‌భావం సామాన్య‌ ప్ర‌జ‌ల‌పై ప‌డ‌కుండా అన్ని చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు.

 Read Also: ఇండియా లో పెరుగుతున్న డింక్​ కల్చర్..!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>