Mobile Popup Ad
Mobile Popup Ad

ఉజ్వల భవిష్యత్తుకు “బాల భరోసా” ఒక వరం: కలెక్టర్ అంకిత్

కలం, ఖమ్మం బ్యూరో : చిన్నారుల ఆరోగ్యమే లక్ష్యంగా వారి ఎదుగుదలలో తలెత్తే లోపాలను తొలిదశలోనే గుర్తించి నివారించేందుకు “బాల భరోసా” కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ (Collector Ankith) స్పష్టం చేశారు. శుక్రవారం కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని రామవరం మాతా శిశు సంరక్షణ కేంద్రంలో బాల భరోసా కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాల లోపు చిన్నారులపై ప్రత్యేక దృష్టి సారించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని, పిల్లల్లో ఉండే న్యూరో డెవలప్మెంట్ సమస్యలు,​ శారీరక ఎదుగుదల లోపాలు, ​మానసిక వికాసంలో ఆలస్యం​వంటి అంశాలను ప్రారంభ దశలోనే గుర్తించడం ద్వారా వారికి మెరుగైన చికిత్స అందించే అవకాశం ఉంటుందన్నారు. దానికి అనుగుణంగా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖలు సమన్వయంతో పనిచేసి ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి భాగస్వామ్యం కావాలన్నారు

“బాల భరోస” కార్యక్రమం ముఖ్య ఉద్దేశం సకాలంలో జోక్యం అని పిల్లలలో ఏవైనా లోపాలు ఉన్నట్లు గుర్తిస్తే, వెంటనే వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స ప్రారంభించి ఆ సమస్య తీవ్రతరం కాకుండా చూడాలన్నారు. ప్రతి చిన్నారి శారీరక, మానసిక స్థితిని నిశితంగా పరిశీలించి, అవసరమైన వారికి ప్రత్యేక వైద్య సేవలు అందించాలన్నారు. చిన్నారులు ఆరోగ్యంగా, సంతోషంగా పెరిగేలా చూడటమే కాకుండా వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ 5 సంవత్సరాలలోపు పిల్లలకు అందిస్తున్న సేవలను మాతా శిశు సంరక్షణ కేంద్రంలోని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. తదుపరి మెరుగైన సేవలు అందించాలన్నారు. ఈ సందర్భంగా మాతా శిశు సంరక్షణ కేంద్రంలోని ప్రతి విభాగాన్ని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు. అనంతరం “బేటి బచావో” కార్యక్రమంలో భాగంగా “భేటీ జన్మోత్సవ్” కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని నెలలోపు జన్మించిన ఆడపిల్లలకు బేటి జన్మోత్సవ్ కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని స్వర్ణలత లేనినా, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది సూపర్వైజర్లు ,అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>