Mobile Popup Ad
Mobile Popup Ad

వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి: చిన్నారెడ్డి

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో మొక్కజొన్న రైతులకు గుడ్ న్యూస్ అందుతోంది. రైతన్నలు ఆరుగాలం కష్టపడి చమటోర్చి పండించిన తమ పంటను కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమయింది. ఈ మేరకు మొక్కజొన్నల కొనుగోలు (Maize Procurement) కేంద్రాలను వెంటనే ప్రారంభించేందుకు మార్క్ ఫెడ్ అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ.చిన్నారెడ్డి (Chinna Reddy) సూచించారు. మొక్కజొన్నలను వెంటనే కొనుగోలు చేయాలని.. మార్క్ ఫెడ్ సంస్థకు ఆదేశించి బ్యాంకు గ్యారంటీకి కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. మంత్రివర్గ సూచనలమేరకు మార్క్ ఫెడ్ అధికారులు వెంటనే మక్క కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొక్కజొన్న పంట విస్తీర్ణం పెరిగి అధికంగా మొక్క జొన్నలు ఉత్పత్తి అయ్యాయని చిన్నారెడ్డి తెలిపారు.

మార్క్ ఫెడ్ కొనుగోలు కేంద్రాలను ఇంకా ప్రారంభించకపోవడంతో రైతులు మద్దతు ధర కన్నా తక్కువగా మార్కెట్ లో మొక్కజొన్నలను అమ్ముకునే దుస్థితి నెలకొందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి కనీస మద్దతు ధర (MSP)కు తగ్గకుండా మొక్కజొన్న ధర క్వింటాలుకు రూ. 2,400 రైతులకు అందించాలని సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొక్కజొన్నల సాగుపై రైతులపై విధించిన ఆంక్షలు వల్ల రాష్ట్రంలో మొక్కజొన్న సాగు గణనీయంగా తగ్గిందని చెప్పారు. మక్కలు పండిస్తే ప్రభుత్వం కొనే సమస్య లేదని బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు హెచ్చరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాగే పత్తి కొనుగోళ్లపై వ్యవసాయ శాఖ అధికారులకు ఆయన కీలక సూచనలు చేశారు. ఈ సీజన్ లో పత్తి ఉత్పత్తి గణనీయంగా పెరగడం, పత్తి బేళ్లు భారీగా మార్కెట్ కు రావడం వల్ల పత్తి కొనుగోలుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థను రంగంలోకి దించి.. పత్తి కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పారు.

 Read Also: ఇండియా లో పెరుగుతున్న డింక్​ కల్చర్..!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>