Mobile Popup Ad
Mobile Popup Ad

మైనార్టీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది : మంత్రి కొండా సురేఖ

కలం, వరంగల్ బ్యూరో: మైనార్టీల సంక్షేమం, అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ (Konda Surekha)  తెలిపారు. గురువారం బక్రీద్ పండుగ సందర్భంగా వరంగల్ (Warangal) నగరంలోని ఎల్‌బీ నగర్, మట్టేవాడ, ఫోర్ట్ వరంగల్ ఈద్గాలలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమాల్లో మంత్రి కొండా సురేఖతో పాటు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి (Konda Murali) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు కొండా సురేఖ–మురళి దంపతులను శాలువాతో సత్కరించి గౌరవించారు.

మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. బక్రీద్ పండుగ త్యాగానికి, విశ్వాసానికి, విధేయతకు ప్రతీక అని పేర్కొన్నారు. తమ కుటుంబ సభ్యులుగా భావించి ఈద్గా ప్రార్థనలకు ఆహ్వానించిన ముస్లిం మత పెద్దలకు, ఈద్గా కమిటీ సభ్యులకు, ప్రజలకు ఆమె (Konda Surekha) ధన్యవాదాలు తెలిపారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో తీసుకొచ్చిన మైనారిటీ రిజర్వేషన్‌ల  వల్ల ఎంతోమంది ముస్లింల జీవితాలలో మార్పు వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పునరంకితమైందని తెలిపారు. విద్య, ఉపాధి, ఆరోగ్య రంగాలలో మైనార్టీల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని మంత్రి వివరించారు. ముస్లింలు వివిధ రంగాలలో ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు.

Read Also: అంతర్రాష్ట్ర జల వివాదాలపై మోదీ కీలక సూచన

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>