కలం, వెబ్ డెస్క్: ఏపీలోని అనకాపల్లి జిల్లాలో జరుగుతున్న టీడీపీ మహానాడు (TDP Mahanadu) వేడుకలు తీవ్ర వివాదాస్పదంగా మారుతున్నాయి. బుధవారం బుచ్చయ్యపేటలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో పలువురు టీడీపీ నాయకులు మహానాడు నిర్వహించగా, నేడు కొత్తకోటలోని ఓ పాఠశాలలో కార్యక్రమం చేపట్టడం విమర్శలకు దారి తీసింది. పాఠశాలలో లైవ్ స్క్రీన్లు ఏర్పాటు చేసి పార్టీ కార్యకర్తలు, నాయకులు మహానాడు ప్రసంగాలను వీక్షించారు. విద్యాబుద్ధులు నేర్పే పాఠశాలలను రాజకీయ వేదికలుగా మార్చడంపై స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కార్యక్రమం కోసం పాఠశాల వెలుపల పార్టీ జెండాలు, బ్యానర్లు ఏర్పాటు చేయడంతో విద్యాసంస్థ కాస్తా రాజకీయ కార్యాలయంగా మారిపోయింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలల్లో రాజకీయ కార్యక్రమాలకు అనుమతి ఎలా ఇస్తారని విద్యాశాఖ అధికారులను పలువురు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వరుసగా రెండో రోజు కూడా జిల్లాలో ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. పవిత్రమైన ఆలయాలు, పాఠశాలల పట్ల గౌరవం లేకుండా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సరికాదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Read Also: జగన్ గుర్తు పెట్టుకో… వంగలపూడి అనిత మాస్ వార్నింగ్!
Follow Us On: Instagram

