మొంథా తుపాను(Cyclone Montha) తెలంగాణలోనూ బీభత్సం సృష్టిస్తోంది. ఈ తుపాను ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొంథా తుపాను ప్రభావం వల్ల తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, 16 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, వరంగల్, జనగామ, యాదాద్రి భువనగిరి, హనుమకొండ, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, పెద్దపల్లి జిల్లాలకు ఆకస్మిక వరద ముప్పు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
Read Also: రేవంత్.. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారా..!

