“ఇది సీఎం దారి”.. మంత్రి దామోదరకు అవమానం!

కలం, వెబ్ డెస్క్: అసెంబ్లీ ప్రాంగణంలో మంత్రి దామోదర రాజనర్సింహాకు (Minister Damodar) అవమానం ఎదురైంది. శాసన మండలి కొత్త భవనంలోకి మంత్రి వెళ్తుండగా సెక్యూరిటీ సిబ్బంది ఆపారు. ఇది సీఎం వెళ్లే దారి, మరో దారిగుండా వెళ్లాలని మంత్రికి సూచించారు. సెక్యూరిటీ తీరుపై మంత్రి ఫైర్ అయ్యారు. నేను మంత్రిని.. నన్నే ఆపుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆ దారిగుండానే మండలి లోపలికి వెళ్లారు. ఈ సందర్భంగా మంత్రితో పాటు ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్ కూడా మండలి లోపలికి వెళ్లారు. ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.

ఇదిలాఉంటే ఇటీవల నిజాం కాలం నాటి శాసనమండలి భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పునరుద్ధరించారు. రూ.30 కోట్లతో పునరుద్దరించిన ఈ భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి 2026 మార్చి 8న ప్రారంభించారు. కాగా, ఇవాళ తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా (Shiv Pratap Shukla) ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

Read Also: దివ్యాంగులు, వృద్ధులకు స్పెషల్ ప్రజావాణి: నల్లగొండ కలెక్టర్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>