ఏఐతో ఈ ఉద్యోగాలకు భయం లేదు !

కలం, వెబ్ డెస్క్:  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)  వస్తే ఉద్యోగాలు పోతాయనే భయం అందరిలోనూ నెలకొంది. చాలా సంస్థలు వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తుండటం ఈ భయాన్ని మరింత అధికం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆంథ్రపిక్ (Anthropic Report)  సంస్థ కీలక నివేదికను విడుదల చేసింది. డిజిటల్ ప్రపంచంలో ఏఐ అద్భుతాలు చేస్తున్నా, వాస్తవ ప్రపంచంలో మనుషులు చేసే కొన్ని పనులను అది చేయలేదని ఈ నివేదిక తేల్చి చెప్పింది. ప్రస్తుతం 30 శాతం ఉద్యోగాలు ఏఐ ప్రభావం లేని ‘జీరో ఎక్స్‌పోజర్’ జోన్‌లో ఉన్నాయని స్పష్టం చేసింది.

ఏఐ తాకలేని ఆ 6 ఉద్యోగాలు ఇవే:

క్షేత్రస్థాయిలో శారీరక శ్రమ, అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సిన ఆరు వృత్తులను ఏఐ భర్తీ చేయలేదని ఆంథ్రపిక్ గుర్తించింది. వంట మనుషుల ఉద్యోగాన్ని ఏఐ భర్తీ చేయలేదు. వంట గదిలో రుచులలో మార్పులు చేర్పులు చేయడం ఏఐకి సాధ్యం కాదు. వాహనాల ఇంజిన్లలో వచ్చే వింత శబ్దాలను పసిగట్టి, అనుభవంతో రిపేర్ చేసే నైపుణ్యం కేవలం మనుషులకే ఉంది. మెకానిక్‌ల ఉద్యోగాలను కూడా చేయలేదు. ఇక ప్రమాదాలను గుర్తించి ప్రాణాలు కాపాడే లైఫ్ గార్డ్స్ ఉద్యోగాలు చేయడమూ ఏఐతో సాధ్యం కాదు. బార్లలో డ్రింక్స్ కలుపుతూ కస్టమర్ల మూడ్ ల బట్టి మాట్లాడే బార్ టెండర్ల లాంటి ఉద్యోగాలను ఏఐ చేయలేదు. ‘రకరకాల ఆకృతుల్లో ఉండే పాత్రలను క్లీన్ చేయడం రోబోలకు క్లిష్టమైన పని. డ్రెస్సింగ్ రూమ్ అటెండెంట్లు ఫ్యాషన్ విషయంలో వ్యక్తిగత సలహాలు ఇస్తూ నమ్మకాన్ని కలిగించడం మనుషులకే సాధ్యం.‘  ఇటువంటి పనులను ఏఐ చేయలేదని ఆంథ్రపిక్ (Anthropic Report)  సంస్థ తేల్చి చెప్పింది. 

ఎవరికి ముప్పు ఉంది?

కంప్యూటర్ ప్రోగ్రామర్లు (75%), డేటా ఎంట్రీ (67%), ఫైనాన్షియల్ అనలిస్టుల ఉద్యోగాలపై ఏఐ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. అధిక చదువు చదివిన వారు, ఎక్కువ జీతం తీసుకునే వారి ఉద్యోగాలే ఎక్కువగా రిస్క్‌లో ఉన్నాయని డేటా చెబుతోంది.

ఎందుకు ఇవి సేఫ్?

డిజిటల్ ప్రపంచం కంటే వాస్తవ ప్రపంచం చాలా గందరగోళంగా ఉంటుంది. ఆవిరి, గ్రీజు, వర్షం వంటి పరిస్థితుల్లో ఏఐ సెన్సార్లు విఫలమవుతున్నాయి. అలాగే సానుభూతి చూపడం, ఎదుటివారి భావాలను అర్థం చేసుకోవడం వంటి పనులకు మనుషులే కావాలి. అందుకే, ఏఐని కేవలం ఒక సాధనంగా వాడుకుంటూ తమ వృత్తిలో ‘మానవ స్పర్శ’ను నిలుపుకునే వారే భవిష్యత్తులో రాణిస్తారని ఆంథ్రపిక్ పరిశోధన వెల్లడించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>