బాలల సంరక్షణ ప్రభుత్వ లక్ష్యం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

కలం, కరీంనగర్ బ్యూరో : బాలల సంరక్షణ ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని ఆరేళ్లలోపు పిల్లలు అంగవైకల్యానికి గురి కాకుండా చూడాలనే లక్ష్యంతో ప్రభుత్వం ‘బాల భరోసా’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Minister Adluri) అన్నారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో శుక్రవారం ‘మే’ డే వేడుకలతో పాటు బాల భరోసా (Bala Bharosa), నశముక్త్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ, పుట్టిన బిడ్డ నుంచి ఆరేళ్ల వయసు వచ్చే వరకు చిన్నారులు వివిధ రకాల వ్యాధుల బారిన పడి అంగవైకల్యానికి గురవుతున్నారని దీనికోసం ‘బాల భరోసా’ అనే కార్యక్రమాన్ని తీసుకువచ్చామని మంత్రి  తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఆరేళ్ల వయసున్న చిన్నారులను వివిధ రకాల పరీక్షలు చేసి లోపాలు ఉంటే మెడికల్ ట్రీట్‌మెంట్ అందించి ఎలాంటి వైకల్యం రాకుండా చూడడం ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 18 లక్షల మంది చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. ఇందులో పలువురికి లోపాలను గుర్తించామని మంత్రి తెలిపారు. వీరికి వైద్యం అందించడానికి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని మంత్రి తెలిపారు. మేడే సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పక్షాన నిలిచి పనిచేస్తుందని అన్నారు. ఇందులో భాగంగా ఇటీవల ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే కేవలం మూడు రోజుల్లోనే సమస్యకు పరిష్కారం చూపించామని మంత్రి తెలిపారు.

కార్మిక శాఖ ద్వారా అందుతున్న పథకాలను జగిత్యాల జిల్లాలోని అసంఘటిత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి (Minister Adluri) ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లాలో టాంకాం ద్వారా శిక్షణను అందించి జగిత్యాల ప్రాంత యువత విదేశాల్లో ఉద్యోగాలు సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖ అధికారులకు మంత్రి సూచించారు. మంత్రి పర్యటన సందర్భంగా కలెక్టరేట్ లో మహిళ స్త్రీ,శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వివిధ రకాల స్టార్స్ ను ఏర్పాటు చేయగా మంత్రి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. పలువురు దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, స్కూటీలు, ఈ ఆటో రిక్షాలను మంత్రి అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర వికలాంగుల సంక్షేమం శాఖ సెక్రటరీ అనిత రామచంద్రన్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ తో పాటు వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

Read Also: ఇండియా లో పెరుగుతున్న డింక్​ కల్చర్..!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>