కలం, సినిమా : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఈ ఏడాది సంక్రాంతికి “మన శంకర వరప్రసాద్ గారు “(Mana Shankara VaraPrasad Garu) సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. అయితే ఈ ఏడాది వేసవికి మెగాస్టార్ నటించిన విశ్వంభర సినిమా కూడా విడుదల కాబోతుంది. బిగ్గెస్ట్ ఫాంటసీ మూవీగా తెరకెక్కిన విశ్వంభర మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తి కాగా వీఎఫ్‌ఎక్స్ వర్క్ పెండింగ్ ఉండటంతో విడుదల ఆలస్యం అయింది.
మన శంకర వరప్రసాద్ గారు ఇచ్చిన సక్సెస్ జోష్ లో వున్న మెగాస్టార్ మరో సినిమా మొదలు పెట్టేందుకు సిద్దం అయ్యారు. తన తరువాత సినిమాను స్టార్ డైరెక్టర్ బాబీ (Bobby) డైరక్షన్ లో చేయనున్నారు. గతంలో దర్శకుడు బాబీ చిరంజీవికి వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్‌బస్టర్ మూవీ అందించాడు. అయితే తాజాగా తెరకెక్కించబోయే మూవీ డిఫరెంట్‌గా ఉంటుందని సమాచారం. ఈ మూవీలో బాలీవుడ్ డైరెక్టర్, యాక్టర్ అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. చిరంజీవి కూతురు పాత్రలో కృతి శెట్టి నటిస్తున్నట్లు ఇటీవల న్యూస్ వైరల్ అయింది. ఫిబ్రవరిలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. మేకర్స్ త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నారు.


