కలం, వెబ్ డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan)కు బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ తరఫున మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఆమె వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణలో క్రిమినల్ కేసులు ఉన్నాయని, ఆమె అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలను కూడా సక్రమంగా వెల్లడించలేదని భోపాల్‌లోని బీజేపీ నాయకులు ఈసీకి ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో కేసులు, ఆస్తుల వివరాలు సమగ్రంగా లేని కారణంగా మీనాక్షి (Meenakshi Natarajan) నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి వివరించారు. దీనిపై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. బీజేపీ ఓటమికి భయపడే మీనాక్షి నామినేషన్‌ను తిరస్కరించిందని ఆరోపించారు. అఫిడవిట్‌పై నోటీసులు ఇస్తే సమాధానం చెప్పేవాళ్లమని స్పష్టం చేశారు. దీనిపై న్యాయపరంగా పోరాడతామని మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు.
Read Also: ముందు ఓట్ చోరీ.. ఇప్పుడు సీట్ చోరీ.. బీజేపీపై రేవంత్ విమర్శలు
Follow Us On: Instagram

