కలం, మహబూబాబాద్: గూడూరు(Gudur) మండలంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తిని లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. గూడూరు మండలానికి చెందిన విష్ణు బైక్పై వెళ్తుండగా, అదే మార్గంలో వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విష్ణు తీవ్రంగా గాయపడి సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

