Mobile Popup Ad
Mobile Popup Ad

ముందు ఓట్ చోరీ.. ఇప్పుడు సీట్ చోరీ.. బీజేపీపై రేవంత్ విమ‌ర్శ‌లు

క‌లం, వెబ్ డెస్క్: బీజేపీ స‌ర్ ప్ర‌క్రియ‌తో దేశంలో ఓట్ చోరీకి పాల్ప‌డింద‌ని, ఇప్పుడు ఏకంగా రాజ్య‌స‌భ‌ సీట్ చోరీకి పాల్పడుతోంద‌ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విమ‌ర్శించారు. కేంద్ర ఎన్నిక‌ల సంఘం మ‌ధ్య‌ప్రదేశ్‌లో మీనాక్షి న‌ట‌రాజ‌న్‌ (Meenakshi Natarajan) రాజ్య‌స‌భ నామినేష‌న్‌ను తిర‌స్క‌రించ‌డంపై సీఎం రేవంత్ స్పందించారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ చేసిన కుట్ర కారణంగా మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురైంద‌న్నారు. నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణ‌ను తీవ్రంగా ఖండిస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన ప్రత్యక్ష దాడిగా సీఎం రేవంత్ అభివ‌ర్ణించారు. దేశంలో ప్రజల గొంతుకలను అణిచివేసే ప్రయత్నం జరుగుతోంద‌ని మండిప‌డ్డారు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇది ఒక చీకటి రోజు అని, దీన్ని ప్రతి పౌరుడు ఖండించాల్సిన అవసరం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. తెలంగాణ‌లో మీనాక్షి న‌ట‌రాజ‌న్‌పై ఎలాంటి క్రిమిన‌ల్ కేసులు లేవ‌ని, నామినేష‌న్ తిరస్క‌ర‌ణ‌పై న్యాయం కోసం కలిసి పోరాడుతామ‌ని సీఎం వెల్ల‌డించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>