ఇన్ స్టాలో మోదీ రికార్డ్.. ఒక్క వీడియోతో సంచలనం!

కలం, వెబ్ డెస్క్: నీట్ పేపర్ లీకేజీ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీరుపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనలు తీవ్ర ఘర్షణలకు దారి తీశాయి. ఈ పరిణామాలపై స్పందిస్తూ.. గురువారం రాత్రి ప్రధాని మోదీ (PM Modi) ఇన్ స్టాలో సెల్ఫీ వీడియో విడుదల చేశారు. కొన్ని నిమిషాల్లోనే అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

270 మిలియన్ వ్యూస్..

ప్రధాని మోదీ సెల్ఫీ వీడియోకు ఇప్పటివరకు 270 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంతేగాకుండా, రాత్రికి రాత్రే ఆయన ఫాలోవర్ల సంఖ్య 10 లక్షలు పెరిగింది. వీడియో విడుదల చేయకముందు వరకు ప్రధాని మోదీకి ఇన్ స్టాలో 101 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. శుక్రవారం సాయంత్రానికి 102 మిలియన్ల ఫాలోవర్లకు చేరుకుంది. కాగా, ప్రపంచంలో అత్యధిక ఫాలోవర్లున్న రాజకీయ నాయకుల్లో మోదీ ఒకరు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>