కలం, మెదక్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలీల పొట్ట కొడుతుందని, కూలీల హక్కులను కాలరాస్తే ఉరుకునేది లేదని తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) హెచ్చరించారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట (మం) కొర్విపల్లిలో జాతీయ ఉపాధి హామీ చట్టంలో గాంధీ పేరు తొలగింపుపై కాంగ్రెస్ నిరసన కార్యక్రమం నిర్వహించింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కలిసి మీనాక్షి పాల్గొని మాట్లాడారు.
గత ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకం కింద ఏ పనిచేయాలో నిర్ణయించేవారని, కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూలీలు ఏం చేయాలో నిర్ణయిస్తుందన్నారు. పేదల ఉపాధి కోసం మన్మోహన్ సింగ్ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొస్తే.. మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ఎత్తేసే కుట్ర చేస్తుందన్నారు. అనంతరం టీపీసీసీ (TPCC) చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. మోడీ గరిబోళ్లకి కష్టాల మీద కష్టాలు పెడుతున్నారన్నారు. దేశంలో పేదలను విస్మరించి, అదాని, అంబానీ బాగుంటే చాలు అని ప్రధాని మోడీ అనుకుంటున్నారని ఆయన విమర్శించారు.

Read Also : కవితను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోం: మధుయాష్కి
Follow Us On: Sharechat


