కలం, వెబ్ డెస్క్ : మేడ్చల్ జిల్లా అల్వాల్ (Alwal) పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒక దినసరి కూలీ ప్రాణాలు కోల్పోయాడు. ఎంఈఎస్ కాలనీలోని ఒక అపార్ట్‌మెంట్ ముందు చెట్టు కొమ్మలు నరుకుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, సూర్యనారాయణ (45) అనే దినసరి కూలీ అపార్ట్‌మెంట్ వద్ద చెట్టు కొమ్మలను నరుకుతుండగా, ఆ కొమ్మలు ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న విద్యుత్ తీగలకు తగిలాయి. దాంతో కరెంట్ షాక్‌కు గురై సూర్యనారాయణ అక్కడికక్కడే మరణించాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: రాజధాని చుట్టూనే రాజకీయం..!
Follow Us On: X(Twitter)

