Mobile Popup Ad
Mobile Popup Ad

మెద‌క్ గిరిజ‌న గురుకులం విద్యార్థుల ఆందోళ‌న‌!

కలం మెదక్ బ్యూరో: మెదక్ (Medak) జిల్లాలోని కౌడిపల్లి వద్ద జాతీయ ర‌హ‌దారి 765 డీ పై గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులు మంగ‌ళ‌వారం ఉద‌యం ఆందోళనకు దిగారు. పాఠ‌శాల ప్రిన్సిపాల్‌ కులం పేరుతో దూషిస్తున్నాడ‌ని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ప్రిన్సిపాల్ ప్రణయ్ కుమార్, ఉపాధ్యాయుడు ఉదయ్ కుమార్ తమను వేధింపులకు గురి చేస్తున్నారని, తమకు ఇవ్వాల్సిన కాస్మొటిక్ చార్జీలు ఇవ్వడం లేదని చెప్తున్నారు. కొద్దిసేపు విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రిన్సిపాల్‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. త‌మ‌ను ప‌లు ర‌కాలుగా వేధిస్తున్న‌ ప్రిన్సిపాల్‌ను త‌క్ష‌ణ‌మే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనతో వాహనాల రాకపోకలకు కాసేపు అంతరాయం కలిగింది. పోలీసులు జోక్యం చేసుకొని నచ్చజెప్పడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.

Read Also: గుండెపోటుతో తొమ్మిదేళ్ల బాలుడు మృతి

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>