గుండెపోటుతో తొమ్మిదేళ్ల బాలుడు మృతి

కలం, వెబ్​ డెస్క్​ : జగిత్యాల (Jagtial) జిల్లా పోరండ్ల గ్రామంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చంద్రశేఖర్, నవిత దంపతులకు ఉన్న ఏకైక కుమారుడు నిషాంత్ గుండెపోటుతో మరణించాడు. స్థానిక శివాలయంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్న సమయంలో, తొమ్మిదేళ్ల నిషాంత్ ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, దురదృష్టవశాత్తూ ఆస్పత్రికి చేరుకునే మార్గమధ్యలోనే ఆ బాలుడు తుదిశ్వాస విడిచాడు.

ప్రస్తుతం మూడో తరగతి చదువుతున్న నిషాంత్ మరణవార్త విన్న గ్రామస్థులు షాక్‌కు గురయ్యారు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు కళ్లముందే విగతజీవిగా పడి ఉండటంతో ఆ తల్లిదండ్రులు ఆక్రందనలు మిన్నంటాయి. చిన్న వయసులోనే గుండెపోటుతో బాలుడు మరణించడంతో పోరండ్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Read Also: బనగానపల్లెలో దారుణ ఘటన.. భార్యను గొడ్డలితో చంపిన వృద్ధుడు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>