లైంగికదాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష

కలం మెదక్ బ్యూరో : మెదక్ (Medak) జిల్లా రేగోడ్ మండలంలో చిన్నారిపై జరిగిన లైంగిక దాడి కేసులో ఫాస్ట్ ట్రాక్ పోక్సో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. స్కూల్ అటెండర్‌గా పనిచేస్తున్న సారా జైపాల్(25) 2019లో అదే స్కూల్ లో చదువుతున్న విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి, ఐదుగురు సాక్షులను విచారించారు. సాక్ష్యాలు పరిశీలించిన తర్వాత కోర్టు నిందితుడిని దోషిగా నిర్ధారించింది. మెదక్ ఫాస్ట్ ట్రాక్ పోక్సో కోర్టు న్యాయమూర్తి ఆర్.ఎం.సుభావల్లి నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు బాధితురాలికి రూ.లక్ష పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చారు. ఈ కేసులో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ ఆఫెన్సెస్ (POCSO) చట్టం – 2012 కింద విచారణ జరిగింది.

Read Also: ఐపీఎల్ 2026కి చిన్నస్వామి స్టేడియం రెడీ!

Follow Us On: X(Twitter)

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>