రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఇదేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులందరినీ ఈ పేరు చాలా సుపరిచితం. గత ఐపీఎల్ ఛాంపియన్. 18 ఏళ్ల వరకు ఒక్క టైటిల్ కొట్టకపోయినా.. ఈ జట్టు ఫ్యాన్‌బేస్ టాప్‌లో ఉంటుంది. అలాంటి ఈ ఫ్రాంఛైజీ హోంగ్రౌండ్ అతి త్వరలో మారనుందన్న వార్తలు ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ సృష్టిస్తున్నాయి. ఇన్నేళ్లు బెంగళూరు హోం గ్రౌండ్(RCB Home Ground)గా కొనసాగిన ఈ జట్టుకు కొత్త వచ్చే హోం గ్రౌండ్ ఏది? అన్న ఆలోచన అభిమానుల్లో అధికమైపోతోంది.ఇప్పుడు ఈ జట్టు హోం గ్రౌండ్ మారడం వెనక ఒక విషాద ఘటన ఉంది.
ఐపీఎల్‌లో అన్ని జట్లు ఒక లెక్క.. ఆర్‌సీబీ ఒక లెక్క. 17 ఏళ్ల తర్వాత 18వ ఏట కప్ గెలిచి సంతోషంలో ఈ ఫ్రాంఛైజీ.. తమ హోంగ్రౌండ్(RCB Home Ground) అయిన చిన్నస్వామి స్టేడియంలో పరేడ్ నిర్వహించింది. దీంతో అక్కడ భారీ తొక్కిసలాట జరిగి పదుల సంఖ్యలో అభిమానులు మరణించారు. ఆ తర్వాత నుంచి ఆ స్టేడియంలో మ్యాచ్‌లు నిర్వహించడానికి అనుమతులు ఇవ్వట్లేదు అధికారులు. ఇప్పుడు ఐపీఎల్ 2026కి సన్నాహాలు జరుగుతున్నాయి. చిన్న స్వామి స్టేడియంలో మ్యాచ్‌లు నిర్వహించడానికి అనుమతి లేకపోతే.. ఆర్‌సీబీ.. మరో చోట తమ మ్యాచ్‌లు ఆడాల్సిందే. అంటే తమ హోం గ్రౌండ్‌ను చిన్నస్వామి నుంచి మార్చుకోవాల్సిందే.
ఈ నేపథ్యంలో ఆర్‌సీబీకి మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఆర్‌సీబీ జట్టు హోం మ్యాచ్‌లను పూణేలో ఉన్న ఎంసీఏ స్టేడియంలో నిర్వహించడానికి ఎంసీఏ ఆఫర్ చేసింది. దీనిపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఈ స్టేడియం కెపాసిటీ 42వేలపైనే. గతంలో పూణే వారియర్స్, రైజింగ్ పూణే సూపర్‌జయింట్స్ ఫ్రాంఛైజీలు ఈ స్టేడియం హోం గ్రౌండ్‌గా మ్యాచ్‌లు ఆడాయి. అయితే ఆర్‌సీబీ హోం గ్రౌండ్ మారుతుందా? ఆర్‌సీబీ కొత్త హోంగా పూణే అవుతుందా? అన్న ప్రశ్నలకు డిసెంబర్‌లో జరిగే ఐపీఎల్ వేలం తర్వాత క్లారిటీ వచ్చే అవకశాలు కనిపిస్తున్నాయి.
Read Also: పాక్ నుంచి యూటర్న్ తీసుకున్న లంక ప్లేయర్లు..
Follow Us on: Youtube

