epaper
Monday, November 17, 2025
epaper

శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ వద్ద ఉద్రిక్తత.. విద్యార్థి మృతితో నిరసన

శ్రీకాకుళం ట్రిపుల్‌‌ ఐటీ(IIIT Srikakulam)లో ఓ విద్యార్థి మృతి చెందడంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకున్నది. విద్యార్థి మృతికి సీనియర్ల దాడి, ర్యాగింగ్ కారణమంటూ తోటి విద్యార్థులు, కుటుంబసభ్యులు నిరసనకు దిగారు. ఇటీవల శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ చదువుతున్న ప్రత్తిపాటి ప్రత్తిపాటి సృజన్‌ (20) మృతి చెందాడు. అతడి మృతి పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కళాశాల ఆవరణలో సృజన్ కుటుంబసభ్యులు, విద్యార్థులు నిరసన తెలిపారు. నిర్వహించి, మృతికి కారణమైన సీనియర్ విద్యార్థులను వెంటనే సస్పెండ్ చేసి, చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. “మా కొడుకు సీనియర్‌ దాడి కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు బాధ్యులను తప్పక కఠినంగా శిక్షించాలి” అని అన్నారు.

IIIT Srikakulam | జూనియర్ విద్యార్థులు కూడా సీనియర్ విద్యార్థుల దౌర్జన్యాలు, దాడులు ఇటీవల ఎక్కువగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “సీనియర్‌లు జూనియర్‌లను వేధింపులకు గురిచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మన భద్రత కోసం ఏమి జరగబోతుందో అర్థం కావడం లేదు” అని తెలిపారు.

Read Also: ఏపీకి మరో భారీ పెట్టుబడి

Follow Us on : Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>