పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన శ్రీలంక టీమ్ నుంచి ఎనిమిది మంది ప్లేయర్లు(Sri Lankan Players) యూటర్న్ తీసుకుని స్వదేశానికి వెళ్లిపోయారు. అక్కడ భద్రతా అంశాల కారణంగానే వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాక్, శ్రీలంక మధ్య వన్డే సిరీస్ కొనసాగుతుందా లేదా అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఇస్లామాబాద్‌లో బాంబు పేలి 12 మంది మరణించారు. ఈ నేపథ్యంలోనే తమ భద్రతపై అనుమానం వ్యక్తం చేశారు శ్రీలంక ప్లేయర్లు. శ్రీలంక క్రికెట్ వర్గాలు కూడా తమ జట్టు భద్రతపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ కారణంగానే ఎనిమిది మంది లంక ప్లేయర్లు స్వదేశానికి బయలుదేరారు.
Sri Lankan Players | ఈ కారణంగా గురువారం రావల్పిండిలో జరగాల్సిన వన్డే మ్యాచ్ జరిగే పరిస్థితి కనిపించడం లేదు. ఈ వన్డే సిరీస్ తర్వాత శ్రీలంక.. పాక్‌లో ముక్కోణపు సిరీస్‌లో కూడా పాల్గొనాల్సి ఉంది. జింబాబ్వే, శ్రీలంక, పాక్ మధ్య ఈ సిరీస్ జరగాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఈ సిరీస్ కూడా జరుగుతుందో లేదో తెలియని పరిస్థితి. పాక్, లంక మధ్య జరగాల్సిన మూడో వన్డే.. రావల్పిండిలో జరగాల్సి ఉంది. బాంబు పేలిన ఇస్లామాబాద్‌కు రావల్పిండి సమీపంలోనే ఉండటంతోనే భద్రతా ప్రమాణాలపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.
Read Also: ముగిసిన షట్ డౌన్.. ఆ ఫైలుపై ట్రంప్ సంతకం
Follow Us on : Pinterest

