కలం, వెబ్ డెస్క్: తెలంగాణ (Telangana) నిప్పుల కొలిమిలా మారింది. భానుడి ప్రతాపానికి జనాలు బెంబేలెత్తిపోతున్నారు. సోమవారం నాడు అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో మే 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు తీవ్రమైన వడగాలులు వస్తున్నాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.
ఈ జిల్లాల వారు బి–అలర్ట్..
ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, వనపర్తి, గద్వాల జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఈ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45–47 డిగ్రీల మధ్య ఉండే అవకాశం ఉంది. మిగతా అన్ని జిల్లాల్‌లో 42–45 డిగ్రీల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువగా ఉందని.. ఉత్తర, తూర్పు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.

