కలం, వెబ్ డెస్క్: ధర్మశాల వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లు కెప్టెన్‌లు ఇద్దరూ అదరగొట్టారు. జట్టును కష్టాల్లో ఆదుకున్నారు. పంజాబ్‌పై ఢిల్లీ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తమ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును కష్టాల కడలి నుంచి బయట పడేయటంలో పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, ఢిల్లీ కెప్టెన్ అక్సర్ పటేల్ కీలకంగా నిలిచారు. చివరకు ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిల్స్ జట్టు అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. బౌలింగ్ సమయంలో పంజాబ్‌ను కట్టడి చేయడంలో సక్సెస్ అయిన ఢిల్లీ, ఆ తర్వాత బ్యాటింగ్ సమయంలో పంజాబ్ బౌలర్లను దాటి బౌండ్రీలు బాదడంలో కూడా అంతే సక్సెస్ అయింది. ఈ మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ 59 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలువగా బౌలింగ్‌లో కూడా పంజాబ్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ అద్భుతంగా రాణించారు. అర్ష్‌దీప్ సింగ్ 4 ఓవర్లు బౌలింగ్ వేసి కేవలం 21 పరుగులే ఇవ్వడంతో పాటు రెండు వికెట్లను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య 33 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 56 పరుగులు చేసి జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 18 పరుగులకే అవుటైనా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బాధ్యతాయుతంగా ఆడి 36 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 59 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మధ్యలో కూపర్ కానోలీ 38 పరుగులతో రాణించగా, చివర్లో సూర్యాన్ష్ షెడ్జ్ కేవలం 8 బంతుల్లోనే 21 పరుగులు పిండుకున్నాడు. మార్కస్ స్టోయినిస్ (1), శశాంక్ సింగ్ (0) నిరాశపరిచారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 57 పరుగులిచ్చి 2 వికెట్లు తీయగా, మాధవ్ తివారీ 2, ముకేశ్ కుమార్ ఒక వికెట్ పడగొట్టారు.
211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ 18.4 ఓవర్లలోనే 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆరంభంలో కేఎల్ రాహుల్ (9), అభిషేక్ పోరెల్ (5), సాహిల్ పరాఖ్ (13), ట్రిస్టన్ స్టబ్స్ (12) తక్కువ స్కోరుకే అవుట్ కావడంతో ఢిల్లీ కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ అక్సర్ పటేల్ 30 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 56 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను నడిపించగా, డేవిడ్ మిల్లర్ 28 బంతుల్లో 51 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. చివర్లో అశుతోష్ శర్మ (24), మాధవ్ తివారీ (18 నాటౌట్), ఔకిబ్ నబీ (10 నాటౌట్) మెరుపు వేగంతో ఆడటంతో ఢిల్లీ విజయం సులభమైంది. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, యశ్ ఠాకూర్ చెరో 2 వికెట్లు తీశారు. బెన్ ద్వార్షుయిస్, మార్కస్ స్టోయినిస్‌లకు తలో వికెట్ దక్కింది.

