Mobile Popup Ad
Mobile Popup Ad

పెట్రోల్ బంకులో భారీ అగ్నిప్రమాదం.. 11 మందికి గాయాలు

కలం, వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్ (Madya Pradesh) రాజ్‌గఢ్ జిల్లా పచోర్ పట్టణంలోని ఓ పెట్రోల్ బంకులో భారీ ప్రమాదం సంభవించింది. పెట్రోల్ పంపు వద్ద ఉన్న ఆయిల్ ట్యాంకర్ కు మంటలు అంటుకోవడంతో నిమిషాల వ్యవధిలో బంకు మొత్తం మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 11 మందికి పైగా తీవ్ర గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

పెట్రోల్ బంకు పట్టణం మధ్యలో ఉండడంతో, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భారీగా మంటలు ఎగసిపడడంతో దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ముందస్తు జాగ్రత్తగా అధికారులు సమీప ప్రాంత ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>