కలం, వెబ్ డెస్క్: తొర్రూరు (Thorrur) మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ మధ్యాహ్నం 12:30 గంటలకు జరగనున్న ఎన్నిక కోసం పట్టణంలో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
సుమారు 500 మంది పోలీసులతో పట్టణాన్ని తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. మున్సిపల్ కార్యాలయానికి వెళ్లే దారులన్నింటినీ మూసివేసి, 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. గొడవలకు తావులేకుండా పోలీసులు గట్టి నిఘా ఉంచారు, అనుమానితులను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.
తొర్రూరు మున్సిపాలిటీ (Thorrur Municipality) చైర్‌పర్సన్ సీటు కోసం ప్రధాన రాజకీయ పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ ఉత్కంఠభరితంగా మారింది. స్థానికంగా బలమైన కేడర్‌తో ఉన్న బీఆర్ఎస్ విజయం కోసం కృషి చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ కూడా గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. రెండు పార్టీల నేతలు వరుస సమావేశాలు నిర్వహిస్తూ కౌన్సిలర్ల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మున్సిపాలిటీ అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారం వంటి అంశాలపై రెండు పార్టీల మధ్య తీవ్ర చర్చ సాగుతోంది. రాజకీయ వర్గాల్లో ఈ పోటీ హాట్ టాపిక్‌గా మారగా, చివరికి ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
Read Also: సినీ నటి ప్రత్యూష కేసులో సుప్రీం సంచలన తీర్పు
Follow Us On : WhatsApp


