epaper
Wednesday, February 18, 2026
epaper

భర్తను కత్తితో పొడిచి హత్య చేసిన భార్య..

కలం, వెబ్​ డెస్క్​ : భర్తలను భార్యలు చంపడం ఇప్పుడు ట్రెండ్​ గా మారింది. ఇలాంటి మర్డర్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను ఓ భార్య అతికిరాతకంగా కత్తితో పొడిచి హత్య చేసింది. ఈ దారుణ ఘటన మంచిర్యాల (Mancherial) జిల్లా మందమర్రి (Mandamarri) లో చోటు చేసుకుంది. పట్టణంలోని శాంతినగర్​ కు చెందిన మోయిన్​, అవంతి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సాఫీగా సాగుతున్న వీరి దాంపత్య జీవితంలో గొడవలు చెలరేగాయి.

ఈ క్రమంలో ఇవాళ (మంగళవారం) మరోసారి గొడవ జరగడంతో తీవ్ర ఆవేశానికి గురయిన అవంతి ఇంట్లో ఉన్న కత్తితో భర్త మోయిన్​ పై దాడి చేసింది. రక్తపు మడుగుల్లో ఉన్న మోయిన్​ ను గ్రామస్తులు (Mandamarri) గుర్తించి ఆస్పత్రికి తరలించగా తీవ్ర రక్తస్రావం కావడంతో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు.

Read Also: సినీ నటి ప్రత్యూష కేసులో సుప్రీం సంచలన తీర్పు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>