కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని మణికొండ (Manikonda )లో మంజీరా తాగునీటి పైప్‌లైన్ పగిలిపోయింది. దీంతో భారీగా నీరు ఎగిసిపడడంతో పలు ఇళ్లు, అపార్ట్‌మెంట్లలోకి నీరు చేరి సెల్లార్లు పూర్తిగా నీటితో నిండిపోయాయి. పైప్‌లైన్ బ్లాస్ట్ కావడంతో రోడ్డు మీదుగా, ఇంట్లోకి నీరు చేరింది. సమాచారం అందుకున్న NDRF (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) బృందాలు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థాలానికి చేరుకున్నారు.
సెల్లార్లలో నిండిన నీటిని పంపుల సాయంతో బయటకు తోడుతున్నారు. గత రెండు గంటలుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నీటి సరఫరా బోర్డు అధికారులు కూడా స్పాట్‌కు చేరుకుని పరిస్థితిని అంచనా వేస్తున్నారు. పైప్‌లైన్ మరమ్మతులు త్వరగా పూర్తి చేసి నీటి సరఫరా సాధారణ స్థితికి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ఘటనతో మణికొండ (Manikonda) ప్రాంతంలో తాత్కాలికంగా నీటి సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉంది.
Read Also: సినీ నటి ప్రత్యూష కేసులో సుప్రీం సంచలన తీర్పు
Follow Us On : WhatsApp


