ప్రధాని మోడీ సభకు భారీ జన సమీకరణ

కలం, నిజామాబాద్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ ఇచ్చిన ఫలితాలతో జోష్ లో ఉన్న బీజేపీ శ్రేణులు ప్రధాని మోడీ పర్యటనను విజయవంతం చేయాలని ప్లాన్ చేస్తున్నాయి. మూడోసారి ప్రధాని అయిన తరవాత మోడీ తెలంగాణకు తొలిసారి వస్తున్నారు. రెండేళ్ల విరామం తర్వాత వస్తుండటంతో పార్టీ నేతలు ఈ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు నేతృత్వంలో ఇప్పటికే ఏర్పాట్లపై సమీక్ష జరిగింది. జిల్లాల వారీగా జన సమీకరణ ఏర్పాట్లలో జిల్లాల ప్రజా ప్రతినిధులు నేతలు తలమునకలయ్యారు.

నిజామాబాద్ నుంచి 15 వేల మంది

సికింద్రాబాద్ లో జరిగే మోడీ బహిరంగ సభకు ఒక్క నిజామాబాద్ (Nizamabad) జిల్లా నుంచి 15 వేల మంది జన సమీకరణ చేస్తున్నారు. జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల ఇన్‌చార్జ్‌ల‌కు బాధ్యతలు అప్పగించారు. అన్ని ప్రాంతాల నుంచి కార్యకర్తలు జనాలు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందు కోసం వాహనాలు భోజన ఏర్పాట్లు చూసుకుంటున్నారు.

నిజామాబాద్ పై ప్రత్యేక బాధ్యతలు

నిజామాబాద్ జిల్లాలో బీజేపీకి ప్రాతినిధ్యం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది. నిజామాబాద్‌లో బీజేపీ ఎంపీగా ధర్మపురి అరవింద్ ఉన్నారు. నిజామాబాద్ నగర ఎమ్మెల్యేగా దన్ పాల్ సూర్యనారాయణ గుప్తా అలాగే ఆర్మూర్‌లో కూడా బీజేపీ ఎమ్మెల్యేగా రాజేష్ రెడ్డి ఉన్నారు. ఇదే ఉమ్మడి జిల్లా కామారెడ్డిలో సైతం బీజేపీ ఎమ్మెల్యేగా వెంకట రమణా రెడ్డి కూడా ఉన్నారు. ఇలా ఒక ఎంపీ, నలుగురు ఎమ్మెల్యేలే ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం ఉండటంతో వారంతా బాధ్యతలు తీసుకున్నారు. ఇటు కామారెడ్డి జిల్లా నుంచి కూడా భారీ జన సమీకరణ చేస్తున్నారు. సికింద్రాబాద్ కు దగ్గరగా రోడ్, రైల్వే మార్గాలు కనెక్టివిటీ సుగమం అవుతుంది. దీంతో కామారెడ్డి. ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ లతో పాటు నిజామాబాద్. ఆర్మూర్. బోధన్. బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల నుంచి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రధాని ప్రారంభోత్సవాల్లో మామిడిపల్లి రైల్వే స్టేషన్

ప్రధాని మోడీ పర్యటనలో పలు రైల్వే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో కూడా ఒక రైల్వే స్టేషన్‌ను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. అదే మామిడిపల్లి రైల్వే స్టేషన్. నిజామాబాద్-కరీంనగర్ మార్గంలో మొదటి రైల్వే స్టేషన్ ఇది. ఇప్పుడు నూతనంగా నిర్మించడంతో అందుబాటులోకి వచ్చింది. ఈ రైల్వే స్టేషన్ ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జ‌రుగ‌నుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>