కలం, వెబ్ డెస్క్: నగరంలోని కూకట్‌పల్లి (Kukatpally) రాజీవ్ గాంధీ నగర్‌లో మంగళవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు గ్యాస్ లీకై మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. నిమిషాల వ్యవధిలోనే మంటలు భారీగా విస్తరించి, అక్కడే ఉన్న సుమారు 8 గ్యాస్ సిలిండర్లు ఒకదాని తర్వాత ఒకటి పెద్ద శబ్దంతో పేలిపోయాయి. దీంతో స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
వరుస పేలుళ్ల శబ్దాలకు చుట్టుపక్కల ప్రాంతాల వారు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదం వల్ల ఆస్తి నష్టం భారీగా జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేస్తున్నారు.
Read Also: మధిర అభివృద్ధికి భారీగా నిధులు: భట్టి
Follow Us On: Instagram


