కలం/ఖమ్మం బ్యూరో: మధిర నియోజకవర్గం మధిర మున్సిపాలిటీ పరిధిలో డ్రైయిన్స్, వైరా నది రిటైనింగ్ వాల్ నిర్మాణానికి 140 కోట్ల రూపాయల ప్రత్యేక అభివృద్ధి నిధులు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు (Bhatti Vikramarka) మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
40 కోట్ల రూపాయలతో మధిర మున్సిపాలిటీ పరిధిలో డ్రైయిన్ నిర్మాణం పనులు, 65 కోట్ల రూపాయలతో వైరా నది వెంట వరద నివారణ కోసం రిటైనింగ్ వాల్ నిర్మాణం, ప్రస్తుతం ఉన్న మురుగునీటి కాలువల ఆధునీకరణ పనులకు 35 కోట్ల నిధులు మంజూరు అయినట్లు డిప్యూటీ సీఎం (Bhatti Vikramarka)ఆ ప్రకటనలో తెలిపారు.
Read Also: హరీశ్ రావు పార్టీ మార్పు.. బీఆర్ఎస్ క్లారిటీ
Follow Us On: X(Twitter)


