కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల సంఖ్యను కేంద్ర ప్రభుత్వం 208 నుంచి 218కి పెంచింది. ఇప్పటివరకూ ఉన్న అధికారులకు అదనంగా పది మందిని పెంచుతూ క్యాడర్ స్ట్రెంథ్ ఫిక్స్ చేసింది. ప్రధాన కార్యదర్శి (Chief Secretary) మొదలు వివిధ శాఖల కార్యదర్శులు, కమిషనర్లు.. వీరితో పాటు 33 జిల్లాలకు కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డైరెక్టర్లు.. ఇలా అన్ని కేటగిరీలు కలిపి మొత్తం 218 మంది ఉంటారని హోంశాఖ పరిధిలోని డీవోపీటీ విడుదల చేసిన గెజిట్ స్పష్టం చేసింది. ఇప్పటివరకూ తెలంగాణ కేడర్ స్ట్రెంథ్ (Telangana IAS Cadre Strength) 208 మాత్రమేనని, ఇక నుంచి 218 అవుతుందని పేర్కొన్నది. ఇందులో సీనియర్ పోస్టులు 119 కాగా 49 సెంట్రల్ డిప్యూటేషన్ సర్వీసుకు చెందినవని తెలిపింది. మొత్తం ఐఏఎస్ పోస్టుల్లో 152 డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ అవుతాయని వివరించింది.
సీఎం రిక్వెస్టు తర్వాత 10 మంది అదనం :
రాష్ట్ర అవసరాలకు తగినట్లుగా కేడర్ స్ట్రెంథ్ (Telangana IAS Cadre Strength) రివ్యూ చేసి ఐఏఎస్ అధికారులను అదనంగా కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) పలుమార్లు రిక్వెస్టు చేశారు. రాష్ట్రంలో 33 జిల్లాలకు కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వివిధ ప్రభుత్వరంగ సంస్థలు.. ఇలా అనేక అవసరాలకు ప్రస్తుతం ఉన్న ఐఏఎస్‌ల సంఖ్య సరిపోవడంలేదని వివరించారు. రెండేండ్ల విజ్ఞప్తుల తర్వాత కేవలం పదిమందిని మాత్రమే అదనంగా కేటాయించి చివరకు కేడర్ స్ట్రెంథ్‌ను 218గా ఫిక్స్ చేసింది.
Read Also: బీర్లపై ఉన్న శ్రద్ధ.. యూరియాపై ఏది?: శ్రీనివాస్ గౌడ్
Follow Us On: X(Twitter)


