కలం, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని అమరావతి (Amaravati)లో మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రాయపూడి సమీపంలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రిన్సిపల్ సెక్రటరీస్ భవనాల నిర్మాణ ప్రాంతంలో మెఘా కంపెనీకి చెందిన ప్లాస్టిక్ పైపుల పరిశ్రమలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో సుమారు రూ.8 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల ఎల్అండ్‌టీ సంస్థకు చెందిన సామగ్రి కూడా అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. దీనిపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. కొద్ది రోజులకే మరో ప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తోంది.
Read Also: శాలరీ కటింగ్ బిల్లుపై సజ్జనార్ కీలక వ్యాఖ్యలు!
Follow Us On: Sharechat

