విజ‌య‌వాడ‌లో ఉగ్ర లింక్‌ల క‌ల‌క‌లం.. ముగ్గురు అరెస్ట్!

క‌లం, వెబ్ డెస్క్‌: విజ‌య‌వాడ‌ (Vijayawada)లో కొంద‌రు యువ‌కులు ఉగ్ర‌వాద లింకులు (Terror Links) క‌లిగి ఉండ‌టం క‌ల‌క‌లం రేపింది. ముగ్గురు యువ‌కులు దేశ వ్య‌తిరేక కార్య‌క‌లాపాలు నిర్వ‌హించ‌డానికి సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్న‌ట్లు పోలీసులు గుర్తించారు. ష‌రీఫ్‌, డానిష్‌, సోహైల్ బేగ్ అనే ముగ్గురు యువ‌కుల‌ను అరెస్ట్ చేశారు. నేడు ముగ్గురిని కోర్టులో హాజ‌రుప‌రుచ‌నున్నారు. నిందితుల‌తో మ‌రో ప‌ది మంది ట‌చ్‌లో ఉన్న‌ట్లు కౌంట‌ర్ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. బీఈఎన్ఎక్స్ అనే గ్రూప్ ఏర్పాటు చేసుకొని, ఈ గ్రూప్ ద్వారా ఉగ్ర కార్య‌క‌లాపాల విస్త‌ర‌ణ‌కు సిద్ధ‌మైన‌ట్లు పోలీసులు వివ‌రించారు. నిందితులు ర్యాపిడో, ఓలా బైక్ డ్రైవ‌ర్లు, బిర్యానీ షాప్ క్యాషియ‌ర్ వ‌ర్క‌ర్లుగా నిందితులు ప‌ని చేస్తున్నారు.

విజ‌య‌వాడ (Vijayawada) వించిపేట‌కు చెందిన మ‌హ్మ‌ద్ అహ్మ‌దుల్లా ష‌రీఫ్‌, భ‌వానిపురానికి చెందిన మ‌హ్మ‌ద్ డానిష్‌, మ‌హంతిపురానికి చెందిన మీర్జా సోహైల్ బేగ్‌లు పోలీసుల అదుపులో ఉన్నారు. ప‌ట్టుబ‌డ్డ ముగ్గురికి హ్యాండ్ల‌ర్ అర్జ్ హ‌కీమ్ షుకూర్ ప‌లు సూచ‌న‌లు కూడా చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ టెర్ర‌ర్ గ్రూప్‌లో హైద‌రాబాద్, బీహార్‌కు చెందిన‌ ఇద్ద‌రు కీ రోల్‌లో ఉన్న‌ట్లు కూడా పోలీసులు గుర్తించారు. హైద‌రాబాద్‌కు చెందిన స‌యిదా బేగం బీహార్ వాసి దిల్‌కాష్‌తో క‌లిసి ప‌ని చేయాల‌ని సూచ‌న‌లు చేశారు. పోలీసులు స‌యిదా బేగం కోసం గాలిస్తున్నారు.

ఐఎస్ఐఎస్, ఐక్యూఐఎస్ లాంటి నిషేధిత ఉగ్ర సంస్థ‌ల ప‌ట్ల ఈ యువ‌కులు ఆకర్షితుల‌య్యారు. దేశంలోని వివిధ ప్రాంతంలోని యువ‌కుల‌తో క‌లిసి సోష‌ల్ మీడియాలో గ్రూపులు ఏర్పాటు చేసి వీరంతా ప‌ని చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఒక ప‌ది మంది కీల‌కంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌, హైద‌రాబాద్‌, బీహార్‌, బెంగాల్‌, రాజ‌స్థాన్ త‌దిత‌ర రాష్ట్రాల నుంచి చాలామంది గ్రూప్‌లో ఉన్నారు. ప్ర‌స్తుతం అరెస్ట్ చేసిన యువ‌కుల వ‌ద్ద మొబైల్ ఫోన్లు, ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స‌ద‌రు యువ‌కులు యూట్యూబ్‌లో బాంబుల త‌యారీ కోసం వీడియోలు వెతికిన‌ట్లు పోలీసులు గుర్తించారు.

Read Also: దుబాయ్‌లో భార‌త్‌ డ్ర‌గ్ మాఫియా డాన్ అరెస్ట్‌

Follow Us On : WhatsApp

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>