కలం, వెబ్ డెస్క్: ఈ నెల 25న పార్టీ మార్పుపై కీలక నిర్ణయం తీసుకుంటానన్న కాంగ్రెస్ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి (Jeevan Reddy)ని పార్టీలోనే కొనసాగించేందుకు కాంగ్రెస్ (Congress) అధిష్టానం అష్టకష్టాలు పడుతోంది. నేడు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) జీవన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆయనతో పాటు ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా ఉన్నారు. జగిత్యాలలో రాజకీయ పరిణామాలు, పార్టీ అధిష్టానం తీరుపై కొద్ది రోజులుగా జీవన్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు.
ఈ నేపథ్యంలో పార్టీ మార్పుపై కొంత కాలంగా జీవన్ రెడ్డి సంకేతాలు ఇస్తున్నారు. జీవన్ పార్టీ మారకుండా హైకమాండ్ బుజ్జగింపులు చేస్తోంది. ఇటీవల మంత్రులు శ్రీధర్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జీవన్ రెడ్డిని కలిసి మాట్లాడారు. తాజాగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జీవన్ రెడ్డితో మాట్లాడారు. జీవన్ రెడ్డి డిమాండ్స్‌ను ఢిల్లీ పెద్దలకు వివరిస్తానని మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. అంత వరకు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు.
మహేశ్‌కుమార్‌తో భేటీ అనంతరం జీవన్ రెడ్డి (Jeevan Reddy) మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మార్పుపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 40 ఏళ్ల అనుబంధం ఉన్న పార్టీని వీడటం బాధగానే ఉందని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రేపు పార్టీకి రాజీనామా చేస్తున్నానని, తనతో పాటు ఎంతమంది రాజీనామా చేస్తారో చూడాలని చెప్పారు. టీపీసీసీ చీఫ్‌కు కూడా ఇదే సంగతి తేల్చి చెప్పినట్లు తెలిపారు. తన సమస్యలకు పరిష్కారం టీపీసీసీ చీఫ్ దగ్గర లేదన్నారు. తాను ఎలాంటి డిమాండ్స్ చేయలేదని స్పష్టం చేశారు. మహేశ్ కుమార్ తనకు పార్టీ మారొద్దని సూచించినట్లు తెలిపారు. కానీ, తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని, రేపు యథావిధిగా కార్యకర్తలతో సమావేశం జరుగుతుందని చెప్పారు. అనంతరం గ్రామాల్లో పర్యటిస్తానని వెల్లడించారు.
Read Also: ఇంధన కొరత లేదన్న సజ్జనార్.. నెటిజన్ల కౌంటర్!
Follow Us On: Instagram

