మత్తు ముఠాలకు ఉచ్చు.. DPEO తీవ్ర హెచ్చరికలు

కలం, నిజామాబాద్ బ్యూరో : డ్రగ్స్ గంజాయితో పాటు కల్లులో కలిపే మత్తు పదార్థాల రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని నిజామాబాద్ (Nizamabad) జిల్లా ఎక్సైజ్ ప్రొహిబిషన్ జిల్లా అధికారి అరుణ్ కుమార్ తెలిపారు. రవాణా సరఫరాదారులపై నిరంతర నిఘా పెడుతున్నామని అదే స్థాయిలో వినియోగదారులకు యువతకు కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకూ పట్టుకున్న వాటితో పాటు అరెస్టు చేసిన నిందితుల వివరాలను డీపీఈవో అరుణ్ కుమార్ వెల్లడించారు.

నిజామాబాద్ పరిధిలో 22 కల్లు శాంపిల్స్ సేకరించి 22 మందిని అరెస్టు చేశామన్నారు. అక్రమ కల్లు రవాణా కేసులు 34 నమోదు కాగా 29 మంది నిందితులను అరెస్ట్ చేసి 2014 లీటర్ల కల్లును స్పాట్ లో నే పారబోసి.. శాంపిల్స్‌ను ల్యాబ్‌కి పంపించినట్టు తెలిపారు. అలాగే గంజాయి రవాణాకు సంబంధించి 12 కేసులు రిజిస్టర్ చేసి 28 కిలోల గంజాయి సీజ్ చేశామని వెల్లడించారు. 21 మంది నిందితులను అరెస్ట్ చేసి 4 వాహనాలు 14 మొబైల్ ఫోన్స్ సీజ్ చేశామని వివరించారు.

అలాగే, ఆర్మూర్ పరిధిలో 14 కల్లు కేసులు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేయగా 1461 లీటర్ల కల్లు స్వాధీనం ధ్వంసం చేశామని తెలిపారు. 33 కల్లు శాంపిల్స్ 33 తీసుకోగా వాటిలో మూడు NDPS కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ఈ కేసులో ఆరుగురిని అరెస్టు చేసి రెండు కిలోల గంజాయి మూడు వాహనాలు సీజ్ చేసినట్లు తెలిపారు.

బోధన్ పరిధిలో 89 కల్లు శాంపిల్స్ సేకరించగా 1089 లీటర్ల కల్లు సీజ్ చేసినట్లు తెలిపారు. భీమ్‌గల్ పరిధిలో గుడుంబా కేసులు 139 నమోదు కాగా 288 లీటర్ల గుడుంబా సీజ్ కాగ, 4785 లీటర్ల పులియబెట్టిన బెల్లం పానకంను పారబోసినట్లు తెలిపారు. మూడు గంజాయి కేసుల్లో 300 గ్రాముల గంజాయి సీజ్ చేశామన్నారు. మూడు కల్తీ కల్లు (టాడీ) కేసుల్లో 94 మంది అరెస్టు అయ్యారని చెప్పారు. మోర్తాడ్ పరిధిలో 16 కేసులు నమోదయిట్టు వివరించారు.

నిరంతర నిఘా – అవగాహన కార్యక్రమాలు

కల్లులో కలిపే మత్తు పదార్థాల రవాణాను అరికట్టడానికి ట్రైన్ చెకింగ్ పాత గంజాయి అమ్మకం దారుల మీద నిరంతర నిఘా ఉంచామని డీపీఈవో అరుణ్ కుమార్ తెలిపారు. గంజాయి రవాణా, అమ్మకాలను నివారించడానికి పాత నేరస్తుల కదలికపై నిఘా పెట్టి వినియోగదారులకు కూడా కౌన్సెలింగ్ చేస్తున్నామన్నారు.

స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి వరకూ కూడా వ్యసనాలకు గురి కాకుండా నిజామాబాద్ ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ అనేక అవగాహన కార్యక్రమాల్లో పాల్గొని కృషి చేస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు కౌన్సెలింగ్ చేస్తున్నామని ఇక ముందు కూడా ఇలాంటి చర్యలు ఉధృత పరిచి చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా అనేక చర్యలు తీసుకుంటామని వివరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>