Mobile Popup Ad
Mobile Popup Ad

ఒకే ప్లాట్ ఇద్దరికి రిజిస్ట్రేషన్: నిజాంపేటలో ‘రియల్’ స్కామ్​ !

కలం, వెబ్ డెస్క్​ : హైదరాబాద్ నగరంలో ప్లాట్ల విక్రయం పేరుతో జరిగిన మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. నిజాంపేట (Nizampet) పరిధిలో ప్లాట్లను అక్రమంగా డబుల్ రిజిస్ట్రేషన్ చేసి అమాయక కొనుగోలుదారుల నుండి సుమారు రూ.15.26 కోట్ల మేర వసూలు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదులు అందడంతో సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (EOW) విచారణ చేపట్టింది.

ఈ భారీ స్కాం కు ప్రధాన నిందితులుగా భావిస్తున్న నిడమర్తి శివప్రసాద్, నవీన్ కుమార్ గోయల్, నరేంద్ర కుమార్ మోదీ, శశికాంత్ మోదీలపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు ఒకే ప్లాట్‌ను వేర్వేరు వ్యక్తులకు విక్రయించి, ఫోర్జరీ పత్రాలతో అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ల పాత్ర కూడా ఉన్నట్లు ఆరోపణలు రావడంతో, వారిపై కూడా కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి, నిందితులకు సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకునే దిశగా పోలీసులు అడుగులు వేస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఈ మొత్తం వ్యవహారంపై సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

Read Also: శాల‌రీ క‌టింగ్ బిల్లుపై స‌జ్జ‌నార్ కీల‌క వ్యాఖ్య‌లు!

Follow Us On: Instagram

 

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>