కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లోని నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం (Nampally Fire Accident) సంభవించింది. స్టేషన్ రోడ్డులోని బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్ దుకాణంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. నాలుగు అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మంటలు పైకి వ్యాపిస్తున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 4 ఫైరింజన్లతో మంటలు అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. భవనంలో ఇద్దరు చిన్నారు సహా మొత్తం ఆరుగురు చిక్కుకున్నట్లు సమాచారం.
Read Also: క్రెడిట్ కార్డు బిల్లులు కట్టలేకపోతున్నారా.. ఇలా చేస్తే సిబిల్ స్కోర్ తగ్గదు..!
Follow Us On: Pinterest


