కలం, వెబ్‌డెస్క్: హైదరాబాద్ (Hyderabad) నగరం పహాడిషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జల్‌పల్లి గ్రామ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. రెండు ఆక్సిజన్ ట్యాంకులు (Oxygen Cylinders) పేలిన ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్ల పైకప్పులు ధ్వంసం అయ్యాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Also: పశ్చిమ బెంగాల్ కొత్త సీఎం ఎవరు?
Follow Us On : WhatsApp

