జనగణన దేశాభివృద్ధికి కీలకం: ఎమ్మెల్సీ అంజిరెడ్డి

కలం, మెదక్ బ్యూరో : భారతదేశ భవిష్యత్తు అభివృద్ధి, సంక్షేమ పథకాల రూపకల్పనలో జనగణన కీలక పాత్ర పోషిస్తుందని ఎమ్మెల్సీ డా. చిన్న మైల్ అంజిరెడ్డి (MLC Anji Reddy) అన్నారు. సంగారెడ్డి (Sangareddy) జిల్లా రామచంద్రపురంలోని తన నివాసంలో జనగణన అధికారులకు పూర్తి వివరాలు అందించి, ఆయన తన పేరును అధికారికంగా నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ, ఈసారి జనగణన డిజిటల్ పద్ధతిలో జరగడం సంతోషకరమని తెలిపారు. ఇది పారదర్శకతను పెంచడమే కాకుండా విద్య, ఉపాధి, మౌలిక సదుపాయాల కల్పనకు ఖచ్చితమైన డేటాను అందిస్తుందని చెప్పారు.

ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వివరాలు నమోదు చేసుకోవడం ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని ఆయన (MLC Anji Reddy) పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న గణన సిబ్బందికి ప్రజలు సహకరించాలని, తప్పుడు సమాచారం ఇవ్వకుండా నిజమైన వివరాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అమీన్‌పూర్ సర్కిల్ డీసీ ప్రదీప్ కుమార్, డీఈ వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.

Read Also: పశ్చిమ బెంగాల్ కొత్త సీఎం ఎవరు?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>