కలం, వెబ్ డెస్క్: పంజాబ్ రాష్ట్రంలోని పటియాలాలో కర్మభూమి ఎక్స్‌ప్రెస్ (Karmabhoomi Express)లో మంటలు చెలరేగాయి. అమృత్‌సర్ నుంచి న్యూ జల్పాయ్‌గురి మధ్య నడిచే కర్మభూమి ఈ రైలులో మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు వెంటనే అప్రమత్తమయ్యారు. చైన్ లాగి అందరూ కిందకు దిగడంతో పెద్ద ఎత్తున్న ప్రాణాపాయం తప్పింది. పటియాలా నగరానికి సమీపంలోని రాజ్‌పురా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, ఫైర్ ఇంజిన్లు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
అయిదు బోగీలు పూర్తిగా మంటల్లో తగలబడిపోతున్నాయి. ముందస్తు జాగ్రత్తగా ఆ మార్గంలో నడిచే రైళ్లను ఎక్కడికక్కడ నిలిపేశారు. రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థను కూడా నిలిపేసి.. విద్యుత్ సరఫరాను పూర్తిగా ఆపేశారు. సమీపంలోకి ఎవరూ రాకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు. రైలులో ఆహార పదార్థాలు సరఫరా చేసే ప్యాంట్రీలో మంటలు చెలరేగి.. అవి మిగతా బోగీలకు కూడా వ్యాపించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.

