Mobile Popup Ad
Mobile Popup Ad

దొంగ ఓట్లతో బెంగాల్‌ను 15 ఏళ్ళు పాలించిన మమతా: రామ్‌చందర్‌రావు

కలం, వెబ్ డెస్క్: తాజాగా వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామ్ చందర్ రావు (Ramchander Rao) స్పందించారు. ఈ ఎన్నికల్లో ఉత్తరాది, దక్షిణాది వైషమ్యాలు సృష్టించిన ఇండియా కూటమికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ఓటమిపై రామ్ చందర్ రావు తీవ్ర విమర్శలు చేశారు. రోహింగ్యాలు, దొంగ ఓట్లతో మమతా బెనర్జీ (Mamata Banerjee) 15 ఏళ్లు బెంగాల్ ను పాలించారని మండిపడ్డారు. గ‌తంలో బెంగాల్‌లో బీజేపీ కార్య‌క‌ర్త‌లను హ‌త్య చేశార‌ని, అస‌లు బీజేపీ అడుగు పెట్ట‌కుండా కుట్ర‌లు చేశార‌ని ఫైర్ అయ్యారు. బీజేపీకి గతంలో ఒక్క సీటు కూడా ఉండేది కాద‌ని, అమిత్ షా స‌హా ముఖ్య నేత‌లంతా బెంగాల్‌లోనే ఉండి పార్టీని గెలిపించుకున్నార‌ని అన్నారు.

గత 33 సంవత్సరాలుగా కమ్యూనిస్టులు, 15 ఏళ్లు తృణమూల్ పాలించిన బెంగాల్ కోటలో బీజేపీ ఘన విజయం సాధించిందని అన్నారు. నేటి ప్రజలు తీర్పుతో అస్సాంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని హర్షం వ్యక్తం చేశారు. కుటుంబ రహిత, అవినీతి రహిత పాలన అందించాం కాబట్టే అస్సాంలో మళ్లీ బీజేపీ గెలిచిందని ధీమా వ్యక్తం చేశారు. ఇక తమిళనాడులో అధికార డీఏంకే పార్టీ తుడిచి పెట్టుకుపోతుందని విమర్శించారు. కేర‌ళ‌తో సౌత్‌లో బీజేపీ హ‌వా కొన‌సాగుతుంద‌ని, రానున్న రోజుల్లో బీజేపీ తెలంగాణ‌లో అధికారంలోకి వ‌స్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ నాంపల్లిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొని మాట్లాడారు.

Read Also: స్టాలిన్ ఓటమి.. సీఎం పదవికి రాజీనామా!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>