కలం, భూపాలపల్లి: వివాహేతర సంబంధం మరో దారుణానికి దారితీసింది. ప్రియుడి మోజులో పడిన ఓ వివాహిత తన భర్తను ప్రియుడితో కలిసి హత్య (Murder) చేసినట్లు ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి (Bhupalpally) జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
భార్య తన ప్రియుడు సంతోష్‌తో కలిసి ఇంట్లోనే భర్తను హత్య చేసినట్లు సమాచారం. అనంతరం మృతదేహాన్ని చికెన్‌పల్లి సమీపంలో పడేసి ఇద్దరూ అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితులుగా అనుమానిస్తున్న మృతుడి భార్య, ఆమె ప్రియుడు సంతోష్ కోసం గాలింపు చేపట్టారు.

