Mobile Popup Ad
Mobile Popup Ad

పెర్కిట్ చెరువులో వేలాది చేపల మృత్యువాత

కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ (Armoor) మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ చెరువులో భారీగా చేపలు మృత్యువాత పడ్డాయి. పెర్కిట్ చెరువులో ఒక్కసారిగా వేల సంఖ్యలో చేపలు చనిపోవడంతో స్థానిక మత్స్యకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువులోకి రసాయనాలతో కలిసిన మురికి నీరు చేరడమే చేపల మృతికి కారణమని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో తమ జీవనోపాధి దెబ్బతిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఐదు సంవత్సరాలుగా వేసవి కాలంలో ఇదే పరిస్థితి కొనసాగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కేవలం శాంపిల్స్ సేకరించడం వరకే పరిమితమవుతున్నారని, చెరువులోకి వ్యర్థాలు రాకుండా కట్టడి చేసే చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. చేపల మృతికి గల కారణాలను గుర్తించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు.

Read Also: భూభారతి పోర్టల్ ప్రారంభించిన మంత్రి పొంగులేటి

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>