కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్(Nizamabad) జిల్లా బోధన్ (Bodhan) పట్టణంలోని విద్యా వికాస్ జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి(Ila Tripathi) గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రంలోని తరగతి గదులను సందర్శించి పరీక్షల నిర్వహణ విధానాన్ని సమగ్రంగా పరిశీలించారు. విధులు నిర్వర్తిస్తున్న అధికారులు, సిబ్బందిని కలెక్టర్ ప్రశ్నించి ఎవరైనా సెల్ ఫోన్లు తీసుకువచ్చారా అని ఆరా తీశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు అనుమతించవద్దని, కట్టుదిట్టమైన పర్యవేక్షణ కొనసాగించాలని నిర్వాహకులను ఆదేశించారు.
విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షలు సజావుగా నిర్వహించాలని అన్నారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, ప్రథమ చికిత్స సదుపాయాలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. అలాగే తరగతి గదుల్లో తగిన వెంటిలేషన్ ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కాపీయింగ్‌కు ఎలాంటి ఆస్కారం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా చూడాలని కలెక్టర్ (Collector Ila Tripathi) సూచించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే ప్రశ్నపత్రాల సీళ్లు తెరిచారా లేదా అనే విషయాన్ని కూడా ఆమె తనిఖీ చేశారు. ఈ తనిఖీలో పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ మంగళ, తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.
Read Also: పెర్కిట్ చెరువులో వేలాది చేపల మృత్యువాత
Follow Us On : WhatsApp

