కలం, వెబ్ డెస్క్ : రాష్ట్ర రైతాంగానికి శుభవార్త అందుతోంది. భూమి సరిహద్దులు, యజమాన్యం సమస్యలు సులభంగా క్లియర్ చేసేందుకు ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ (Bhu Bharati Portal) ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Srinivas Reddy) గురువారం ఆవిష్కరించారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం మిఠాయిపల్లిలో పోర్టల్ ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. బీఆర్ఎస్ తీసుకువచ్చిన ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పినట్లుగానే చేశామని వెల్లడించారు. రైతులకు, భూయజమానులకు భరోసా, అండగా ఉండేలా భూభారతి తీసుకువచ్చామని వివరించారు.
దీని అమలు కోసం ట్రైనింగ్ ఇచ్చి లైసెన్స్డ్ సర్వేయర్లను ఏర్పాటు చేసుకున్నామని మంత్రి పేర్కొన్నారు. ప్రతి మండలానికి స్పేర్‍లో ఉండేలా రోవర్లు అందుబాటులోకి తీసుకురాబోతున్నామని వివరించారు. అయితే రాష్ట్రంలోని ఐదు మండలాల్లో ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టర్ (Bhu Bharati) ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని చెప్పారు. దీంతో రిజిస్ట్రేషన్, సరిహద్దులతో కూడిన మ్యాప్‍తో పాటు భూదార్ నంబర్ కేటాయించనున్నట్లు వెల్లడించారు. కాగా, ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టర్ ను పైలట్ ప్రాజెక్టు కింద ఖమ్మం జిల్లా కూసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట, రంగారెడ్డి జిల్లా అమన్‌గల్, సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి, నారాయణపేట జిల్లా కోస్గి మండలాల్లో దీన్ని అమలు చేయబోతున్నారు.
Read Also: ఫ్యూచర్ సిటీ కార్యాలయం త్వరగా పూర్తి చేయాలి.. సీఎం రేవంత్ ఆదేశం
Follow Us On: Sharechat

