Mobile Popup Ad
Mobile Popup Ad

అమ్మాయిలకు గుడ్​‌న్యూస్​.. పెళ్లితో క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది!

కలం, వెబ్ డెస్క్: పెళ్లితో బంధాలు, బాధ్యతలు మాత్రమే కాదు.. ఆరోగ్యకరమైన జీవితాన్ని సొంతం చేసుకోవచ్చు. ఇది పెద్దలు మాత్రమే చెప్తున్న విషయం కాదు.. పరిశోధకులు స్టడీ చేసి చెప్తున్న మాట. పెళ్లి చేసుకున్న వ్యక్తులను (Married People), పెళ్లి చేసుకోని వారితో పోలిస్తే క్యాన్సర్ (Cancer Risk) వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని ‘క్యాన్సర్ రీసెర్చ్ కమ్యూనికేషన్స్‘ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం తెలిపింది. దీని ప్రకారం.. పెళ్లి కాని పురుషుల్లో క్యాన్సర్ వచ్చే అవకాశం 68 శాతం ఎక్కువగా ఉండగా, మహిళల్లో ఇది ఏకంగా 83 శాతం అధికంగా ఉందని తేలింది. కేవలం ప్రస్తుత వైవాహిక జీవితమే కాకుండా, విడాకులు తీసుకున్నవారు, తమ లైఫ్ పార్ట్‌నర్‌ను కోల్పోయినవారిలో కూడా ముప్పు తక్కువగానే ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.

ముప్పు తగ్గడానికి కారణాలు ఇవే

వివాహిత వ్యక్తులకు ఉండే సామాజిక మద్దతు ఉండటమే ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు. భార్యాభర్తలు ఒకరి ఆరోగ్యంపై (Health) ఒకరు శ్రద్ధ వహించడం, లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని ప్రోత్సహించడం వల్ల వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించే అవకాశం ఉంటుంది. అలాగే ఒంటరిగా ఉండేవారి కంటే పెళ్లి చేసుకున్నవారు ధూమపానం, మద్యపానం లాంటివి ఆరోగ్యానికి హాని చేసే అలవాట్లకు దూరంగా ఉంటారు. ఫలితంగా ఇది ఊపిరితిత్తులు, గర్భాశయ క్యాన్సర్ల నివారణలో సహాయపడుతుందని అధ్యయనం పేర్కొంది.

మహిళల్లో అధిక ప్రభావం

మహిళల విషయంలో పెళ్లి వల్ల క్యాన్సర్ ముప్పు (Cancer Risk) మరింత తగ్గుతోందని ఈ రిసెర్చ్ హైలైట్ చేసింది. ముఖ్యంగా అండాశయ, గర్భాశయ గోడ క్యాన్సర్ల నుంచి మహిళలకు రక్షణ లభిస్తోంది. దీనికి గర్భధారణ, సంతానం కలగడం వంటి జీవక్రియలు కూడా ఒక కారణంగా నిలుస్తున్నాయి. వయస్సు పెరిగే కొద్దీ ఈ రక్షణ ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఒక మంచి భాగస్వామ్యం శారీరక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని రీసెర్చర్స్ భావిస్తున్నారు.

Read Also: కంటి ఇన్ఫెక్షన్లకు ఇక మందులు కూడా పనిచేయవా?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>