“న్యూ ఇయర్ తరువాత యుద్ధమే”.. ఇరాన్​ కు ట్రంప్ డెడ్ లైన్!

కలం, వెబ్ డెస్క్: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగేలా ప్రస్తుత పరిస్థితులు ఆధారంగా స్పష్టమవుతోంది. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు కొలిక్కి రాకపోతే ఇరాన్ పై దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) హెచ్చరించారు. ఇరాన్ తో కొనసాగుతున్న చర్చలపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

దౌత్యపరమైన సంప్రదింపులు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదన్నారు. అమెరికాతో పాటు తమ మిత్ర దేశాలపై కుట్రపూరిత చర్యలను కొనసాగిస్తూనే చర్చల పేరుతో ఇరాన్ కాలయాపన చేస్తోందని ఆయన ఆరోపించారు. అలాగే, ఇరాన్ అధికారులను ఉద్దేశించి వారిని ప్రొఫెషనల్ ట్యాప్ డ్యాన్సర్లు గా ట్రంప్ అభివర్ణించారు. చర్చల సిద్ధం అంటున్న ఇరాన్ కు నిజాయతీ లేదని ఆయన (Donald Trump) విమర్శించారు.

హోర్ముజ్ జలసంధిలో అమెరికా నావికాదళాన్ని దిగ్బంధిస్తే ఇరాన్ కు భారీ నష్టం తప్పదని ట్రంప్ హెచ్చరించారు. తమ నౌకాదళాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేసే ఇరాన్ నౌకలు సముద్ర గర్భంలో కలవాల్సి వస్తుందన్నారు. ఇరాన్‌కు అత్యంత కీలకమైన చమురు ఎగుమతి కేంద్రాల్లో ఒకటైన ఖార్గ్ ద్వీపం నుంచి నావికా దిగ్బంధాన్ని ఛేదించేందుకు ట్యాంకర్ల కాన్వాయ్‌ను సిద్ధం చేస్తున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ట్రంప్ తాజా హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>