epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

కిక్‌బాక్సింగ్ తొలగింపుకు కేంద్రం ఓకే..

యూనవర్సిటీ స్థాయి క్రీడల నుంచి కిక్‌బాక్సింగ్‌(Kickboxing)ను తొలగించాలన్న ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ(Mansukh Mandaviya) వెల్లడించారు. AIU తన వార్షిక క్రీడా క్యాలెండర్‌ను సులభతరం చేయడం, విస్తృత స్థాయిలో విద్యార్థులు పాల్గొనే క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వడం, జాతీయ-అంతర్జాతీయంగా ఎక్కువ ప్రాసంగికత ఉన్న క్రీడలపైనే దృష్టి పెట్టడం వంటి కారణాలతో కిక్‌బాక్సింగ్ సహా కొన్ని క్రీడలను జాబితాలో నుంచి తొలగించడం జరిగిందని ఆయన వివరించారు.

కిక్‌బాక్సింగ్(Kickboxing) పోటీలలో గత ఐదేళ్లలో గణనీయ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. 2020–21లో కోవిడ్ కారణంగా పోటీలు రద్దు కాగా, అనంతరం 2021–22లో పురుషుల నుండి 283 మంది, మహిళల నుండి 134 మంది పాల్గొన్నారు. 2022–23లో పాల్గొనేవారి సంఖ్య గణనీయంగా పెరిగి పురుషులలో 541, మహిళలలో 301 మంది పోటీలకు హాజరయ్యారు. 2023–24లో పాల్గొనివారి సంఖ్య కొంత తగ్గినా, పురుషుల నుండి 360, మహిళల నుండి 168 మంది పాల్గొన్నారు. తాజా సంవత్సరం 2024–25లో కూడా ఆసక్తి కొనసాగి, పురుషుల నుండి 393 మంది, మహిళల నుండి 199 మంది కిక్‌బాక్సింగ్ పోటీల్లో పాల్గొన్నారు.

ఈ నేపథ్యంలో కిక్‌బాక్సింగ్‌ను తొలగించడం వల్ల శిక్షణ తీసుకుంటున్న విద్యార్థి–క్రీడాకారులపై ఎలాంటి ప్రభావం ఉంటుందో మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా సమీక్షించలేదని ప్రభుత్వం తెలిపింది. AIU ఒక స్వతంత్ర సంస్థగా పనిచేస్తున్నందున క్రీడలను చేర్చడం లేదా తొలగించడం వారి నిర్ణయాధికారంలోనే ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఇదే కారణంగా కిక్‌బాక్సింగ్‌ను తిరిగి చేర్చాలని AIUకు ప్రభుత్వం సూచించే ప్రణాళిక కూడా లేదని తెలిపారు. విశ్వవిద్యాలయ స్థాయిలో అధికసంఖ్యలో విద్యార్థులు పాల్గొంటున్న క్రీడను ఒక్కసారిగా తొలగించడం విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో AIU భవిష్యత్తులో దీనిని తిరిగి పరిగణించాలా లేదా అన్నది ఇప్పటికీ అనిశ్చితిలోనే ఉంది.

Read Also: క్రికెట్‌కు టీమిండియా ఫాస్ట్ బౌలర్ గుడ్‌బై

Follow Us On: WhatsApp Channel

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>